పెరుగు 2 కప్పులు, కొద్దిగా పంచదార...కొద్దిగా ఉప్పు... వీటన్నిటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీటిని కలుపుకొని మిక్సీ వేయాలి. తరువాత ఐస్ కలుపుకొని చల్లగా సేవించవచ్చు.
కావలసినవిపెరుగు : 3 కప్పులు, పుదీనా ఆకులు(సన్నగా ముక్కలు చేయాలి) కప్పు. బ్లాక్ సాల్ట్ : 1 టీ స్పూను, ఐస్ కొద్దిగా...
మిక్సీలో అన్నిటిని వేసి కొద్దిగా నీరు కూడా పోసి అన్నీ కలిసేదాకా మిక్సీ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలో పోసి అందులో ఐస్ కలుపుకోవాలి.
పెరుగు 2 కప్పులు, బొప్పాయి ముక్కలు కొద్దిగా.. తెనె 2 స్పూన్లు, యాలకులపొడి అరస్పూను.
అన్నిటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీరు కూడా పోసి మిక్సీ తిప్పుకోవాలి. చివరిలో యాలకులపొడి కొద్దిగా ఐస్ కూడా కలుపుకొని చల్లగా తాగవచ్చు.
ద్రాక్షా లస్సీకి నల్లద్రాక్షాలు బాగుంటాయి. 100 గ్రాములు నల్లద్రాక్షా, కప్పు పెరుగు, పంచదార 4 స్పూన్లు అన్నీటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీరుకూడా కలుపుకొని మీక్సీ వేయాలి. తరువాత కొద్దిగా ఐస్ కలుపుకొని చల్లగా సేవించవచ్చు.
బంగినపల్లి మామిడి కాయ ఒకటి చిన్నముక్కలుగా కోయాలి. రెండు కప్పుల పెరుగు, తేనె 2 స్పూన్లు... అన్నిటిని మీక్సీ వేసి కొద్దిగా ఐస్ కలుపుకొని చల్లగా తాగవచ్చు.
పెరుగు 3 కప్పులు....శొంఠి పొడి అర స్పూను..మిరియాల పొడి అరస్పూను...పొదీనా ఆకులు కొద్దిగా...ఉప్పు కొద్దిగా.. అన్నిటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలుపుకొని మిక్సీ వేసిన తరువాత ఐస్ కలుపుకొని చల్లగా సేవించాలి.
పెరుగు 2 కప్పులు...స్ట్రాబెర్రీలు 4..తేనె 2 స్పూన్లు.. యాలకుల పొడి అరస్పూను..అన్నిటినీ కలిపి మిక్సీవేసి... గ్లాసులలో పొసిన తరువాత కొద్దిగా ఐస్ కలుపుకొంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.