రామాయణం వాల్మికి మహర్షి చేత రచింపబడినది. మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజింపబడినది. వీటినే కాండాలు అంటారు. వాల్మికి రచించిన రామాయణాన్నే మూలరామాయణంగా భావిస్తారు.
వాల్మీకి గాక ఇంకా అనేకమంది రామాయణాన్ని రచించారు. వారిలో కొందరు తిక్కన నిర్వచనోత్తర రామాయణం, గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథరామాయణం(ఉడుత చేసిన సాయం, ఊర్మిళాదేవి నిద్ర మొదలగునవి ఇందులోనివే) , మొల్ల రచించిన మొల్ల రామాయణం, భాస్కరుడు రచించిన భాస్కర రామాయణం, తులసీదాస్ రచించి రామచరితమానస్ ఇంకా అనేకం ఉన్నాయి.
బాల కాండములో రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో యాగరక్షణార్ధము ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము మొదలగునవి
అయోధ్యా కాండలో కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస ప్రారంభము
అరణ్య కాండలో వనవాసం, మహర్షుల సందర్శనము, రాక్షస సంహారము, లక్ష్మణునిచే శూర్పణఖ ముక్కుచెవులు కోయిట, సీతాపహరణము
కిష్కింధ కాండలో రాముని దుఃఖము, హనుమంతుని పరిచయం, రామ సుగ్రీవుల స్నేహము, వాలి వధ, సీతాన్వేషణ మొదలు.....
సుందర కాండలో హనుమంతుడు సాగరమును దాటుట, లంకలో సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియచేయుట
యుధ్ధ కాండలో సాగరమునకు వారధి నిర్మించుట, రావణసైన్యంతో యద్ధము, రావణ సంహారము, సీతాదేవి అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక,
రామ పట్టాభిషేకము....
ఉత్తర కాండలో సీత అడవులకు పంపబడుట, వాల్మికి మహర్షి ఆశ్రమమునందు కుశ లవుల జననము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి
తరువాత పేజిలో.... బాలకాండము......