header

Sri Krishna

లోకానికి గీతోపదేశం ద్వారా అద్భుతమైన సందేశం అందించిన వాడు శ్రీకృష్ణుడు. పాండవులకు సఖుడు, బంధువు, గురువు, సర్వస్వము తానై వారిని విజయపధాన నడిపిస్తాడు. అర్జునుని రథసారధిగా కురుక్షేత్రయుద్ధంలో పాండవులకు విజయం సాధించి పెట్టినవాడు. శ్రీ కృష్ణుడు ద్వారకాధిపతి. (నేటి గుజరాత్ లోని ద్వారక) కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. పెంచిన తల్లి దండ్రులు యశోదా, నందులు(వ్రేపల్లె, లేక గోకులం గోకుల, మధుర దగ్గర)

శ్రీకృష్ణ జననం
ఉగ్రసేన మహారాజు కుమారుడు కంసుడు, కుమార్తె దేవకి. కంసుడు మధురా (నేటి మధుర, ఉత్తరప్రదేశ్) నగరానికి రాజు శ్రీకృష్ణునికి మేనమామ, దేవకిని యదు వంశానికి చెందిన శూరసేన మహారాజు పుత్రుడైన వసుదేవునికిచ్చి వివాహం చేస్తారు.
చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి, దేవకి ఎనిమిదో కుమారుని చేతిలో కంసుడు మరణిస్తాడు అని తెలియచేస్తుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది.
తరువాత పేజిలో................