Rajghat and other Samadhulu, New Delhi

Mahatma Gandhi Samadhi

Rajghat 1948, 31 జనవరిన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలో యమునానదీ తీరాన ఉన్న ఈ ఆరుబయలు కట్టడము వద్ద ఒక అనంతజ్వాల అవిశ్రాంతముగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చికబయళ్ళగుండా వెళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టుగోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడి సమాధి పై దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమొనర్చబడిన రెండు సంగ్రహశాలలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.
భారతదేశ పర్యటనకు విచ్చేసిన విదేశీ అధికారులు రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచి నివాళులర్పించటం ఒక సాంప్రదాయంగా మారింది. పర్యాటకులు విధిగా స్మారక స్థలాన్ని సందర్శించబోయేముందు తమ పాదరక్షలను గౌరవసూచకంగా తొలగించాలి. గాంధీ మరణించిన రోజుకు గుర్తుగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్మారకోత్సవాలు జరుగుతాయి. ప్రతి గాంధీ జయంతి, వర్థంతుల సందర్భములో రాజ్ ఘాట్ వద్ద భజన కార్యక్రమాలు నిర్వహింపబడతాయి.
రాజ్ ఘాట్ అను మాటకు రాజ్య సదనం అనునది అర్థముగా భావించవచ్చు యమునానదీ తీరంలోనే రాజ్ ఘాట్ సమీపంలో ఇతర ప్రముఖ నాయకుల సమాధులు మరియు స్మారక స్థలాలు ఉన్నాయి. భారత వ్యవసాయ ఉద్యానవన సంఘానికి కార్యదర్శిగా, భారత ప్రభుత్వమందు ఉద్యానవన కార్యక్రమాలకు నిర్వాహకునిగా పని చేసిన ఆఖరి ఆంగ్లేయుడైన సిడ్నీ పెర్సీ-లాంకాస్టర్ ఈ స్మారకస్థలికి రూపకల్పన చేసారు.
రాజ్ ఘాట్ కి ఉత్తరాన శాంతివన్ పేరుతో జవహర్‌లాల్ నెహ్రూ సమాధి ఉన్నది. దేశదేశాల అధ్యక్షులు, అధికారులు నాటిన మొక్కలతో కూడిన ఒక చక్కని ఉద్యానవనం ఇక్కడ ఉన్నది. నెహ్రూ మనవడైన సంజయ్ గాంధీ సమాధి నెహ్రూ సమాధి పక్కనే ఉన్నది.

Raj Ghat Surrounded by lawns, there lies a memorial of black marble along with an eternal flame, called as Raj Ghat. It reminds us of a man who is called as the father of the India ‘Mahatma Gandhi’. Take a few hours to visit the memorial of Gandhiji and enjoy the serenity spread all over. This place is a sign of respect, so all visitors are allowed to take off their shoes before approaching the Gandhiji’s memorial. This place brings peace of mind and so it should be visited once while taking heritage walk in Delhi.

Other Ghats / ఇతరనాయకుల సమాధులు
నాయకుని పేరు రాజకీయ స్థానం స్మారక స్థలం
జవహర్‌లాల్ నెహ్రూ
Jawaharlal Nehr
ప్రధానమంత్రి
Prime Minister
శాంతివన్
Santivan
లాల్ బహదూర్ శాస్త్రి
Lalbahudar Sastry
ప్రధానమంత్రి
Prime Minister
విజయ్ ఘాట్
Vijay Ghat
ఇందిరా గాంధీ
Indira Gandhi
ప్రధానమంత్రి
Prime Minister
శక్తి స్థల్
Sakthisthal
జగ్ జీవన్ రాం
Jagajeevan Ram
ఉప ప్రధానమంత్రి
Dy.Prime Minister
సమతాస్థల్
Samatasthal
చరణ్ సింగ్
Charan Singh
ప్రధానమంత్రి
Prime Minister
కిసాన్ ఘాట్
Kisan Ghat
రాజీవ్ గాంధీ
Rajeev Gandhi
ప్రధానమంత్రి
Prime Minister
వీర్ భూమి
Veer Bhoomi
జ్ఞాని జైల్ సింగ్
Gnani Jailsingh
భారత రాష్ట్రపతి
President
ఏక్తా స్థల్
Ekta Sthal
శంకర్ దయాళ్ శర్మ
Sankar Dayal Sarma
భారత రాష్ట్రపతి
President
........