గోవాలో చాలా ప్రసిద్ధి చెందిన బీచ్ ఇది. దీనినే క్వీన్ ఆఫ్ బీచెస్ అని కూడా అంటారు. బీచ్ చాలా రద్దీగా ఉంటుంది. జూన్ నుండి సెప్టంబర్ దాకా సముద్రం ఉదృతంగా ఉంటుంది. కాలంలో ఈతను నిషేధిస్తారు. డిసెంబర్, జనవరి నెలలో కార్నివాల్స్ (ఉత్సవాల) తో కోలాహలంగా ఉంటుంది. ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ధి. ఎక్కడా లేని క్రీడలు ఇక్కడ ఉంటాయి. లవాటర్ స్పోర్ట్స్ మరియు ఇతర ఆటలకు రుసుము చెల్లించవలసి ఉంటుంది . అందరికీ అందుబాటులో వసతి సౌకర్యం లభిస్తుంది.
ఈ బీచ్ కలన్ గాట్ బీచ్ కు ఆనుకొని ఉన్నది. నైట్ లైఫ్ కు ఈ బీచ్ ఫేమస్. కొన్ని పబ్స్ ఇక్కడ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ వీటిలో జంటలకు మాత్రమే ప్రవేశం. తలలు ఊపే కొబ్బరి చెట్లు, అందమైన దృశ్యాలు మధ్యా ప్రతి క్షణం ఆనందంగా గడపవచ్చు.
అన్ని తరగతుల వారికి అందుబాటులో వసతి సౌకర్యం లభిస్తుంది. గోవా రాజధాని పనాజీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బగా బీచ్ కు బస్సులలో వెళ్లవచ్చు.
అందమైన బీచ్ ఇది. మిరామర్ బీచ్ కు 1 కి.మీ, పనాజీ కి 7 కి.మీ దూరంలో ఉంటుంది. సంవత్సరమంతా ఈ బీచ్ వివిధ కార్యకలాపాలతో సందడిగా ఉంటుంది. లవర్స్ పారడైజ్ గా పిలువబడే ఈ బీచ్ పేరు పోర్చు గీస్ వైస్రాయ్ కుమార్తె డోనా పౌలా పేరుమీదగా వచ్చింది. ఈమె ఒక సామాన్య జాలరితో ప్రేమలో పడుతుంది. దీనికి ఈమె తండ్రి అంగీకరించడు. దీనితో ఈమె కొండశిఖరం మీదనుండి దుమికి చనిపోతుంది. ఈమె పేరుమీదగానే ఈ బీచ్ కు డోనా పౌలా అనేపేరు స్థిరపడింది.
ఈ బీచ్ ఒడ్డునే ఉన్న దుకాణాలలో స్ట్రాలతో తయారు చేయబడ్డ టోపీలు, చేతిరుమాళ్లు, వైన్ అమ్మబడుతాయి. సముద్రంలో లభించే చేపలు, రొయ్యల ఆహారపదార్ధాలు లభిస్తాయి.
మిరామర్ బీచ్ : గోవా ముఖ్యపట్టణం పనాజీకి (పాంజిం) 3 కి.మీ. దూరంలో ఉన్న చిన్న బీచ్ ఇది. అరేబియన్ సముద్రంలో
మాండోవి నది కలయు చోటు. తాటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
కోల్వా బీచ్ : దీనినే వైట్ శాండ్ బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ ఇసుక చాలా సన్నగా, తెల్లగా ఉంటుంది. మందుటెండలలో
కూడా ఇసుక వేడెక్కకుండా చల్లగా ఉంటుంది
అంజునా బీచ్ : షాపింగ్ చేయాలనుకునే వారు ఇక్కడకు వస్తారు. వందలాది దుకాణాలలో స్థానికులు తయారు చేసిన రకరకాల వస్తువులు
అమ్ముతారు. ఈ బీచ్ లో ఈత ప్రమాదం. అలలు వచ్చిన వేగం కంటే నాలుగు రెట్ల అధిక వేగంతో వెనుకకు వెళతాయి
ఈ బీచ్ మారుమూల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సందర్శకులు తక్కువగా ఉంటారు.. మిరామిర్ బీచ్ కు 45 కి.మీ. దూరంలో ఉంటుంది. ఎక్కువమంది విదేశీయులు సన్ బాత్ చేస్తూ కనబడతారు. తొంభై శాతం మంది విదేశీయులే. విహారయాత్రలకు వచ్చి నెలల తరబడి ఇక్కడే ఉంటారు. ఇళ్ళు కొనుగోలు చేసి ఇక్కడే స్ధిరపడిన వారిని చూడవచ్చు రంగురాళ్ళు, కళాఖండాలు, ఆర్టిఫిషియల్ జ్యూయలరీలను అమ్ముతూ విదేశీయులు కనిపిస్తారు. విదేశీయులు చాలా మంది హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ శివుడి గీతాలను ఆలపిస్తూ కనిపిస్తారు
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ :
కర్నాటకా – గోవా సరిహద్దులలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా చూడదగ్గవి. కానీ అక్కడకు
వెళ్ళాలంటే క్యాజిల్ రాక్ అనే ప్రాంతం దగ్గర నుంచి వెళ్ళాలి. వారానికి ఒకటో రెండో రైళ్ళు ఉంటాయి. చాలామంది నడచి వెళతారు. కొండలమీద నుండి వచ్చే నీరు తెల్లగా, పాలధారలాగా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి దూద్ సాగర్ అని పేరు.
కిందపడ్డ నీరు కొలనులా ఏర్పడుతుంది. ఇక్కడ ఆహారం, హోటల్స్ ఉండవు. ముందుగానే తీసుకు వెళ్ళటం మంచిది