గోవా (కొంకణ్) భారత దేశంలోని పశ్ఛిమ దిశలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం. ఉత్తరాన మహారాష్ట్ర,తూర్పు, పశ్ఛిమాన కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి అరేబియన్ సముద్రం ఒడ్డున ఉన్నది. పనాజీ గోవా రాజధాని. వాస్కోడిగామా గోవాలోని అతిపెద్ద నగరం. మార్గోవా చరిత్ర ప్రసిద్ధి గాంచిన పట్టణం గోవా అన్ని కాలాలలో విదేశీ, స్వదేశీ పర్యాటకులతో కళకళలాడుతుంది. గోవా రెండు రాష్ట్రాలుగా విభజింప బడినది. నార్త్ గోవా, సౌత్ గోవా
నార్త్ గోవాలో చూడవలసినవి : వేయి సంవత్సరాల నాటి సప్తకోటేశ్వరాలయం, మేయమ్ లేక్, ముపాసా టౌన్, గుండా వగాటోర్ బీచ్, అంజునా బీచ్, కలన్ గూటి బీచ్, అగౌడా ఫోర్ట్, పాంజిమ్ హేండీ క్రాఫ్ట్స్ ఎంపోరియం
సౌత్ గోవాలో చూడవలసినవి : దీనినే ఓల్డ్ గోవా అనికూడా అంటారు. చర్చీలు, బోమ్ జీసెస్ బాలికా, సే కేధిడ్రిల్, వాక్స్ వరల్డ్ మ్యూజియం, క్రిస్టియన్ ఆర్ట్స్ మ్యూజియం, మంగేష్ టెంపుల్, శాంతా దుర్గా టెంపుల్, పురాతన గోవా మ్యూజియం, మార్గోవా, కోల్వాబీర్, డోనిపౌలాబే, మిరామిర్ బీచ్ లు.
పర్వటనకు అనుకూల సమయం: వింటర్ సీజన్లో విదేశీ టూరిస్టులతో నిండిపోయి కళ కళలాడుతూ ఉంటుంది. కానీ చాలా రద్దీగా ఉంటుంది. హోటల్స్ లో రూములు ఖాళీ ఉండవు. బీచ్ లు అన్నీ జనంతో నిండిపోయి అర్థరాత్రి దాకా సాగే మ్యూజికల్ పార్టీలతో సందడిగా ఉంటుంది. మాన్ సూన్ సీజన్లో గోవా ప్రశాంతంగా ఉంటుంది. వర్షాకాలంలో గోవా అందాలు చూడాలంటారు.
కర్నాటకా – గోవా సరిహద్దులలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా చూడదగ్గవి. కానీ అక్కడకు వెళ్ళాలంటే క్యాజిల్ రాక్ అనే ప్రాంతం దగ్గర నుంచి వెళ్ళాలి. వారానికి ఒకటో రెండో రైళ్ళు ఉంటాయి. చాలామంది నడచి వెళతారు. కొండలమీద నుండి వచ్చే నీరు తెల్లగా, పాలధారలాగా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి దూద్ సాగర్ అనిపేరు. కిందపడ్డ నీరు కొలనులా ఏర్పడుతుంది. ఇక్కడ ఆహారం, హోటల్స్ ఉండవు. ముందుగానే తీసుకు వెళ్ళటం మంచిది.
వసతి సౌకర్యం : గోవా టూరిజం వారిచే నిర్వహించబడుచున్న పనాజీ, మార్గోవా, ముపూసా, వాస్కో రెసిడెన్సీలలో బసచేయవచ్చు. బీచ్ కు దగ్గరలో వసతి కావలంటే కలన్ గూటి, మిరామర్, కోల్వా రెసిడెన్సీలు ఉన్నాయి.
భాష: గోవాలో అధికార భాష కొంకణి. అయినా హిందీ ఎక్కవగా మాట్లాడుతారు.
ఆహారం : గోవా సీఫుడ్ (సముద్ర చేపలు, రొయ్యలు వగైరా)కు చాలా ప్రసిద్ది. అన్ని రెస్టారెంట్ లలో సీఫుడ్ లభిస్తుంది.
మద్యం : గోవాలో మద్యం అమ్మటానికి లైసెన్సు అవసరం లేదు కనుక అన్నిచోట్ల చిన్న చిన్న ఇళ్ళలో, దుకాణాలలో సైతం మద్యం అమ్ముతుంటారు.