india tour header

National Parks, Gujarat Tourism, Gir National Park

gir lions gir safari leopard hyna

గిర్ అభయారణ్యం (జాతీయ వనం)
భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం గిర్ అభయారణ్యం. ఆసియాలోనే సింహాల ఆవాసంగా ప్రసిద్ధి గాంచినది. దీనిలో ప్రస్తుతం 300 సింహాల దాకా ఉన్నాయి. 1975లో ఈ పార్కును ఏర్పాటు చేసేనాటికి సింహాలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింహాలు చిట్టడవి నడుమ లేక ఆహారం కోసం పచ్చిక బయళ్ళలో సంచరిస్తూ ఉంటాయి. గిర్ అరణ్యం మొత్తం 1412 కిలోమీటర్ల లో విస్తరించి ఉన్నది. సింహాలతో పాటు, చిరుతలు, మచ్చల జింకలు, దుప్పులు, అడవి పందులు, సిలోన్ ఎలుగుబంట్లు, హైనాలు, నక్కలు, పంగోలిన్స్, పక్షులు మొదలగునవి కూడా ఉన్నాయి. కమలేశ్వర్ డ్యామ్ దగ్గర మొసళ్ళను, కొండచిలువలను, రాక్షస బల్లులను చూడవచ్చు. బరోడా విశ్వవిద్యాలయం వారు జరిపిన సర్వేలో ఈ ప్రాంతంలో 507 వృక్షజాతులు ఉన్నట్లుగా నిర్ధారించారు.
గిర్ అభయారణ్యం గుండా 7 నదులు ప్రవహిస్తున్నాయి. హిరాన్, శత్రుంజి, దటర్జీ, మచుంద్రీ , సింగోడా, మొడావరి, రావల్. వీటిలో హిరన్, మచుంద్రీ మరియు మరియు సింగోడా నదులపై ఆనకట్టలు కట్టబడినవి. ఈ నాలుగు జలాశయాలనుండి అభయారణ్యాలకు మండువేసవిలో కూడా నీరు లభిస్తుంది.
గిర్ వనాలలో 300కు పైగా వివిధ పక్షి జాతులున్నాయి.గరుడపక్షులు, రాబందులను సైతం ఇక్కడ చూడవచ్చు. పక్షులను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఇది మంచి ప్రదేశం.
ఈ అరణ్యాలలో మల్ధరీ గిరిజనులు నివసిస్తూ ఉంటారు. ఆవులను, గేదెలను పార్క్ లలో పెంచుతుంటారు. సింహాలకు ఇవే ప్రధాన ఆహారం. ఈ నేషనల్ పార్కులో నివసించే మరో గిరిజన జాతి వారు. సిద్ధీస్. వీరు ఆఫ్రికా మూలాలకు చెందినవారుగా భావిస్తున్నారు. వీరు చేసే నృత్యాలు పేరు గడించినవి. ఈ గిర్ అరణ్యాలకు తోడు దేవాలి సఫారి పార్కు కూడా ఉంది. ఇక్కడ కూడా సింహాలు ఇంకా అనేక జంతువులను చూడవచ్చు.
Next Page...