header

Jammu & Kashmir Tourism / జమ్మూ మరియు కాశ్మీర్ పర్యాటకం....

Jammu & Kashmir Tourism / జమ్మూ మరియు కాశ్మీర్ పర్యాటకం....

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల ఒడిలో కల జమ్మూ మరియు కాశ్మీర్ , సహజ అందచందాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. కాశ్మీర్ వాలీ, జమ్మూ, మరియు లడఖ్ ఈ మూడు కలిపి జమ్మూ, కాశ్మీర్ ప్రాంతం కిందకు వస్తాయి సంవత్సరం అంతా పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ ప్రదేశం.
ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి జహంగీర్, ఈ ప్రదేశ అందాలకు అశ్ఛర్య పడి ఈ భూమిపై స్వర్గం వుంటే అది జమ్మూ కాశ్మీర్ మాత్రమేనని పలికాడు. బ్రహ్మాన్దమిన్ పర్వత శ్రేణులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, ఎన్నో పుణ్య క్షేత్రాలు, మంచు చరియలు,ఉద్యాన వనాలు అన్నీ కూడా ఈ ప్రదేశ గొప్పతనాన్ని చాటుతూనే వుంటాయి.
వాతావరణం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. అయితే, కాశ్మీర్ పర్యటనకు మార్చ్ నుండి అక్టోబర్ వరకు సరైన సమయం. ఈ సమయంలో ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదంగా వుంది సైట్ సీయింగ్ కు అనుకూలం గా వుంటుంది.
ఈ ప్రాంతంలో చాలాభాగం డిసెంబర్ నుండి మార్చ్ వరకు మంచు తో కప్పబడి వుంటుంది. ఈ సమయం వింటర్ క్రీడలు ఆచరించే వారికీ అనుకూలం. జమ్మూ సందర్శనకు సెప్టెంబర్ మరియు మార్చ్ కాలం అనువైనది. లడఖ్ లో శీతాకాలం తీవ్రం కనుక వేసవి అనుకూలం. భాషలు జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉర్దూ అధికార భాష. ఇది పెర్షియన్ లిపిలో వుంటుంది. రాష్ట్రం అంతటా దీనినే మాట్లాడతారు. కాశ్మీర్ లో ఉర్దూ భాష అధికం. కాశ్మీరీ, ఉర్దూ, డోగ్రి, పహారీ, బాల్టి, లడఖి, గోజ్రి, షినా, పష్తో భాషలు కూడా వినపడతాయి.
జమ్మూ మరియు కాశ్మీర్ కు శ్రీనగర్ ను వేసవి రాజధాని గాను, జమ్మూను వింటర్ రాజధానిగాను పరిగణిస్తారు. పీర్ పాన్జాల్ మౌంటెన్ శ్రేణుల నుండి, హిమాలయాల వరకూ ఈ ప్రాంతం ప్రకృతి ప్రియులకు, యాత్రికులకు కనువిందు చేస్తాయి. కళా ప్రియులు చూడదగ్గవి జమ్మూలోని మరమహల్ మ్యూజియం మరియు డోగ్రా ఆర్ట్ మ్యూజియంలు.
వైష్ణో దేవి, దర్గా గరీబ్ షా, బాహు టెంపుల్, జియరాట్ బాబా బుద్దాన్ షా, శివ ఖొరి, పీర్ ఖో కావే టెంపుల్ వంటివి ప్రసిద్ధి గాంచిన కొన్ని మతపర ప్రదేశాలు.
స్వచ్చమైన నీలి వర్ణపు నీరు, పర్వత శ్రేణులు, సరస్సులు, ఆహ్లాదకర వాతావరణం కాశ్మీర్ లోయ ప్రధాన ఆకర్షణలు. ఆపిల్ మరియు చెర్రీ పండ్ల తోటలు, షికారా సవారీలు, గొందోలా సవారీలు, హౌస్ బోటు లు, కాశ్మీరీ హస్త కళలు మొదలైనవి ఈ ప్రాంతపు ప్రత్యేకతలు.
హాజరాత్బాల్ మసీదు, జామా మసీదు, చరార్ యి షరీఫ్ , ఖీర్ భవాని టెంపుల్, మార్తాండ్ సన్ టెంపుల్, శంకరాచార్య టెంపుల్, ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడి ప్రసిద్ధ మొఘల్ ఉద్యానవనాలు అంటే నిషాత్ గార్డెన్, షాలిమార్ గార్డెన్, చాసం ఎ షాహీ గార్డెన్ వంటి మొఘలుల సామ్రాజ్య కాల వైభవోపేత నిర్మాణాలను సందర్శించవచ్చు. పహల్గాం, సోనా మార్గ, పత్నిటాప్,ద్రాస్స్ , గుల్మార్గ్, కార్గిల్ ప్రదేశాలు సహజ అందాలకు ప్రసిద్ధి. దాల్ సరస్సు, నాగిన్ సరస్సు , రెండూ కూడా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి.
వివిధ జాతీయ పార్కులు, బయోస్పియర్ రిజర్వులు అంటే,, దాచిగాం వైల్డ్ లైఫ్ సంక్చురి, గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వు, హేమిస్ హై అల్టి టూడ వైల్డ్ లైఫ్ శాంక్చురి , ఓవరా నేషనల్ పార్క్ వంటివి వన్య జంతు ప్రియులకు, ప్రకృతి ప్రియులకు ఆసక్తిని కలిగిస్తాయి. పర్వతారోహణ, హైకింగ్, ట్రెక్కింగ్, రాఫ్టింగ్, స్కై యింగ్ , ఇతర వింటర్ క్రీడలు ఆచరిన్చాలనుకునే సాహస క్రీడాకారులకు పుష్కలమైన అవకాశాలు కలవు. పత్ని టాప్, గుల్మార్గ్ క్రిమ్చి, కిష్టా వార్ వంటి ప్రదేశాలు, సాహస క్రీడలకు ప్రసిద్ధి. లడఖ్ ప్రాంతం అధిక సంఖ్యలో కల అక్కడి పురాతన బౌద్ధ ఆరామాలకు, భవనాలకు, అనేక ట్రెక్కింగ్ అవకాశాలకు ప్రసిద్ధి. వివాదాస్పద పాన్గోంగ్ లేక్, లడఖ్ ప్రదేశాలు అద్భుత సహజ అందాలతో వాటి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
తరువాత పేజీలో.....