ఎల్లోరా గుహలు
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ పట్టణానికి కు 30 కి.మి. దూరంలో ఎల్లోరా గ్రామము ఉన్నది. ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. (వీటి నిర్మాణం -600-800 బి.సి.), 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థలను తెలుపుతాయి.ఈ గుహలు -నిర్మాణం –క్రీస్తుపూర్వం 600-900 . 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. ఈ ఐదు జైన గుహలు – క్రీస్తు పూర్వం 800-1000 మధ్య నిర్మించబడినవి. పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చూపిస్తున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.
ఈ గుహలలో బౌద్ధ ఛైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల సమైక్యతకు నిదర్శనం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికంగా వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరా గుహలను చూడటానికి ఆగష్టు-అక్టోబర్ మధ్య కాలం అనువైనది. వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.
గుహలు నిర్మాణం :
మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.
ప్రసిద్దమైన గుహలు :
మొదటి గుహ ఎల్లోరా గుహలన్నింటి లో చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది