telugukiranam

Switzerland Tourism / స్విట్జర్లాండ్‌ పర్యాటకం...

Switzerland Tourism / స్విట్జర్లాండ్‌ పర్యాటకం...
స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. విస్తీర్ణం 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌
స్విట్జర్లాండ్‌ లో చలి ఎక్కువ. శీతకాలం -20డిగ్రీలు కూడా నమోదవుతుంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి.
బెర్న్‌లో 100కు పైగా ఫౌంటేన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్‌ ఫౌంటేన్స్‌’ అంటారు.
ఐరోపా ఖండంలో ఉన్న స్విట్జర్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్‌. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్‌ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. జపాన్‌ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే.
బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్‌ సొరంగం(రైల్వే టన్నెల్‌) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3కిలోమీటర్లు ఆల్ప్స్‌ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది.
ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్‌ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది. జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. 1500కు పైగా సరస్సులున్నాయి.
స్విట్జర్లాండ్ లో చూడవలసినవి......
రైనే జలపాతం…
నయాగరా జలపాతంతో పోలిస్తే రైనె జలపాతం చిన్నదే. కానీ 75 అడుగుల ఎత్తులో 450 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జలపాతంలో ఏదో ప్రత్యేకత. పైగా ఐరోపాలోని సమతల నీటి జలపాతాల్లోకెల్లా ఇదే పెద్దది. ఈ జలపాతానికి దగ్గరలోనే న్యూహసన్ గుహలు ఉన్నాయి. వాటిని సందర్శించాక జలపాతానికి ఇరువైపులా దాన్ని దగ్గరగా చూసేందుకు పర్యటకులకోసం ప్లాట్ఫామ్లు నిర్మించారు. ఈ జలపాతం కిందకి దూకి నదిగా మారే ప్రదేశం మధ్యలో రైనేఫాల్ ఫెల్సిన్ అనే పెద్ద బండరాయి ఉంది. ఇది చాలా లక్షల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. జలపాతానికి దిగువనే పారే నదిలో పడవలు తిరుగుతుంటాయి. ఆ పడవల ద్వారా సందర్శకులు ఆ బండరాయి వరకూ వెళ్లి వస్తుంటారు. జలపాతం దిగువనుంచి మలుపు తీసుకుని, కొండలమీదుగా జలపాతం పైకి రైల్లో ప్రయాణిస్తూ ఆ రైనే జలపాత అందాల్ని చూడటం మరిచిపోలేని అనుభూతి
జ్యురిచ్ ...
ఇక్కడ పన్నులు తక్కువ. కానీ చాలా ఖరీదైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక నగరాల్లో ఇదొకటి. స్విట్జర్లాండ్ దేశంలోని ముఖ్య బ్యాంకులూ పరిశోధన కేంద్రాలూ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జ్యూరిచ్ సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్రాంతమే నగరానికి ప్రధాన వ్యాపార కూడలి. జ్యూరిచ్ సరస్సు దిగువ భాగంలో ప్రయాణించే లిమ్మాట్ నది చుట్టూ ఈ సుందర నగరాన్ని నిర్మించారు. నిజానికి పగటివేళలో అక్కడ బస చేయగలిగితే మంచిది. జ్యూరిచ్ కళల మ్యూజియం, బొటానికల్ ఉద్యానవనమూ, ఫిపా ప్రపంచ ఫుట్బాల్ మ్యూజియమూ ప్రార్థనామందిరాలూ... ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
పిలాటుస్ పర్వత యాత్ర
తరువాత పేజీలో.....